
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
● ఆలయాలు, మండపాల్లో
కొలువుదీరనున్న అమ్మవారు
● ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
వనపర్తిటౌన్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాకేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి, వేంకటేశ్వరస్వామి, రామాలయం, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి, కమటేశ్వరి, బ్రహ్మంగారి ఆలయాలతో పాటు వివిధ కాలనీల్లో మండపాలను ఏర్పాటు చేసి విద్యుద్ధీపాలతో అందంగా అలంకరించారు. నిర్వాహకులు అమ్మవార్లను రోజుకో రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాజ ప్రసాదంలో వనపర్తి సంస్థానాదీశుల వారసుడు రాజాకృష్ణదేవరావు తొమ్మిది రోజుల పాటు దుర్గామాత పూజలు చేయడంతో పాటు రామాయణ పారాయణంతో ఉత్సవాలను ప్రారంభించి విజయదశమి రోజు శ్రీరామ పట్టాభిషేక పారాయణంతో ముగించడం ఆనవాయితీగా వస్తోంది.