
నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడి
పాన్‌గల్: నాణ్యమైన విత్తనంతో అధిక దిగుబడులు పొందవచ్చని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీధర్, శ్రీరామ్, శోభారాథోడ్ రైతులకు సూచించారు. నాణ్యమైన విత్తనం.. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని మాందాపూర్, దత్తాయిపల్లిలో పర్యటించి రైతులు సాగు చేసిన కావేరి 1638 రకం వరి పంటను పరిశీలించారు. విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. ప్రతి గ్రామానికి సరిపడా నాణ్యమైన విత్తనం గ్రామంలోనే సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాస్, అఖిల, రైతులు పాల్గొన్నారు.