
అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎస్పీ..
తల్లిదండ్రులు
గర్వించేస్థాయికి ఎదగాలి
కొత్తకోట రూరల్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మాతృభూమికి మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు సేవలు అందించేలా ఎదగాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆకాంక్షించారు. నిబద్ధత, కఠోర సాధన, ప్రణాళికబద్ధంగా చదివితే కలలను సాకారం చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పలువురు అందించిన నగదుతో తరగతి గదులు, పాఠశాల గోడలపై పిల్లల్ని ఆకర్షించేలా పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు, శాస్త్రవేత్తల చిత్రాలు గీయించారు. వాటిని ఆయన తిలకించడంతో పాటు విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. అంతకుముందు పాఠశాలకు వచ్చిన ఎస్పీకి విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. తరగతి గదిలోనే ఉజ్వల భవిష్యత్ ఉందని, ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుతం మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు మంచి పుస్తకం, మంచి స్నేహితుడిని ఎంచుకుంటే చాలా సాధించవచ్చన్నారు. ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు చాలావరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చినవారేనని తెలిపారు. విజయం సాధించిన వారి జీవితాలను విద్యార్ధులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం సహకరించిన యువత, ప్రధానోపాధ్యాయుడిని ఎస్పీ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులత, ఎస్‌ఐ శివకుమార్, ఏసీటీఓ ప్రసన్నరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బండి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు జీకే శ్రీనివాస్, రోజారాణి, కిరణ్‌కుమార్, సుచిత్ర, ఈశ్వర్, మధు పాల్గొన్నారు.
వనపర్తి: బీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఎస్పీ రావుల గిరిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిలాద్ ఉన్ నబి శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా భావిస్తారన్నారు. ప్రజలంతా ఐక్యత, స్నేహభావంతో మెలగాలని సూచించారు. ఈ నెల 5న మిలాద్ ఉన్ నబి, అదే రోజు గణేష్ నిమజ్జనం ఉన్నందున ముస్లింలు గొప్ప ఔదార్యాన్ని చాటుతూ అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారానికి మార్చుకోవడం హర్షణీయమన్నా రు. కార్యక్రమంలో ఎండీ బాబా, చాంద్‌పాషా, ఎండీ గౌస్, ఎండీ ఆరీఫ్, సుల్తాన్, మహబూబ్ పాషా, నవాజ్. ఫయాజ్. సోహెల్, సమీర్, రిజ్వాన్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్