
యూరియా అక్రమంగా తరలిస్తున్నారంటూ..
కొత్తకోట రూరల్: రైతులు యూరియా కోసం తెల్లవారుజామున వచ్చి వరుసలో నిలబడి పడిగాపులు పడుతుంటే.. వారికి ఇవ్వకుండా రాత్రిళ్లు అక్రమంగా తరలిస్తున్నారంటూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని పీఏసీఎస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలం పంటలు ముగింపు దశకు చేరుతున్న సమయంలోనూ రైతులకు సరిపడా యూరియా అందించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంటుందని, కొందరు నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించుకొని రాత్రిళ్లు అక్రమంగా తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. యూరియాను రైతులకు సరఫరా చేయాలని, అక్రమంగా తరించుకుపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ సీఈఓ బాలరాజుకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గుంత మల్లేష్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ చీర్ల నాగన్నసాగర్, వహీద్, రాంచందర్, జనార్దన్ తదితరులు ఉన్నారు.