
మాజీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలకాలి
మహారాణిపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. మంగళవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వలంటీర్ విభాగ సమావేశం జరిగింది. జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఉమ్మడి విశాఖకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. వలంటీర్ విభాగం జోనల్ ఇన్‌చార్జి సునీల్, రాష్ట్ర వలంటీర్ విభాగ ప్రధాన కార్యదర్శి పులగం శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శి పచరపల్లి రాము, వలంటీర్ విభాగ జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు.
వలంటీర్ల సమావేశంలో కేకే రాజు