
జగన్‌కు భారీ స్వాగత సన్నాహాలు
అగనంపూడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలోని వైద్య కళాశాలను సందర్శించనుండడంతో.. లంకెలపాలెం కూడలి వద్ద భారీ ఎత్తున స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. లంకెలపాలెం కూడలి అనకాపల్లి జిల్లాకు ప్రవేశమార్గం అయినందున.. ఇక్కడ భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ పీఏసీ సభ్యుడు కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మంగళవారం లంకెలపాలెం కూడలిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ 79వ వార్డు అధ్యక్షుడు అప్పికొండ మహాలక్ష్మినాయుడు, సీనియర్ నాయకులు గండి రవికుమార్, సుందరపు అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్‌రాజ్, రాష్ట్ర సోషల్ మీడియా అధికారిక ప్రతినిధి కర్రి నరసింగరావు, గంజి సురేష్, సునీల్, సిరపువరపు వాసు, ఉగ్గిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
లంకెలపాలెం వద్ద నేతల ఏర్పాట్ల పరిశీలన