
కురుపాం గురుకుల విద్యార్థినులకు పరామర్శ
మహారాణిపేట: అస్వస్థత, అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌లతో కలిసి మంత్రి మంగళవారం కేజీహెచ్‌కు వచ్చారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటివరకు 53 మంది చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు రాగా, మంగళవారం 13 మంది డిశ్చార్జి అయ్యారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత మిగిలిన వారిని కూడా ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయిస్తాం’ అని చెప్పారు. కురుపాం ఘటన, అక్కడి పరిస్థితులపై అధికారుల బృందం విచారిస్తోందని, వారు ఇచ్చే నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్యాదేవి, సీఎస్‌ఆర్‌ఎంవో యు.శ్రీహరి, ఇతర వైద్యాధికారులు మంత్రి వెంట ఉన్నారు.
మెరుగైన వైద్యం అందించాలని
మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం