
త్వరితగతిన ఆధార్ సీడింగ్
విశాఖ సిటీ: విద్యుత్ సర్వీస్ నెంబర్లకు ఆధార్ సీడింగ్‌లో తప్పులను సరిదిద్దే ప్రక్రియను ఏపీఈపీడీసీఎల్ అధికారులు చేపట్టారు. ఒక ఆధార్ నెంబర్‌కు పదుల సంఖ్యలో విద్యుత్ సర్వీస్ నెంబర్లను జత చేయడం, ఒకరి పేరుతో ఉన్న సర్వీస్ నెంబర్‌కు మరొకరి ఆధార్ అనుసంధానించడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ‘కరెంటోళ్ల నిర్లక్ష్యం.. విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ అస్తవ్యస్తం’ శీర్షికను సాక్షి కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందిస్తూ.. అస్తవ్యస్తంగా ఉన్న ఆధార్ సీడింగ్ తప్పులు వేగవంతంగా సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. కరెంట్ సర్వీస్ నెంబర్‌కు జత చేసిన తప్పుడు ఆధార్ నెంబర్‌ను తొలగించేందుకు గతంలో వినియోగదారులు సచివాలయం, అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం, ఈఆర్‌వో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఏఈ కార్యాలయంలోనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి.శ్యాంబాబు తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ఈ తరహా ఫిర్యాదులను సైతం ఇదే విధంగా పరిష్కరించి వినియోగదారులకు సమాచారం అందజేస్తున్నామన్నారు.
తప్పులు సరిదిద్దుతున్నామన్న
ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ శ్యాంబాబు