
దేశరక్షణ రంగంలో హెచ్‌ఎస్‌ఎల్ కీలక పాత్ర
సింథియా: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి షిప్‌యార్డ్ సీఎండీ గిరిదీప్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాంతి, అహింస సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీజీ సేవలను ఆయన కొనియాడారు. గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ఉద్యోగులకు, భాగస్వాములకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా స్వదేశీ నౌకా నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, అలాగే అక్టోబర్ 2 నుంచి 31 వరకు ‘స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ ను ప్రారంభిస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు.