
నేడు పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటన
దొరవారిసత్రం : మండలంలోని పాళెంపాడు గ్రామంలో బుధవారం రాష్ట్ర బృందం పర్యటించనుంది. సాక్షి పత్రికలో ‘ప్రాణాపాయంలో పాళెంపాడు’ అనే శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మంగళవారం ఈ మేరకు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటించనున్నట్లు వెల్లడించారు. కిడ్నీ వ్యాధి బారిన ప్రజలు ఎందుకు పడుతున్నారో క్షేత్రస్థాయిలో కారణాలను పరిశీలించనున్నట్లు వివరించారు.
కలెక్టర్‌కు అభినందన
చంద్రగిరి: స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు విజయవంతం చేసినందుకు మంగళవారం నారావారిపలెల్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా కలెక్టర్ వెంకటేశ్వర్ స్కోచ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
నవోదయలో ప్రవేశ
దరఖాస్తుకు గడువు పెంపు
తిరుపతి సిటీ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో పాటు ఇతర వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్–నవోదయ కోచింగ్ ఇన్‌స్టిట్యూ ట్, లేదా 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఎస్వీయూలో 10న జాబ్ మేళా
తిరుపతి సిటీ : ఎస్వీయూలోని ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో ఈనెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పలు కంపెనీలు ఇంటర్వ్యూలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉపాధిలో అవినీతిపై పునర్విచారణ
కలువాయి(సైదాపురం) : కలువాయి మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతిపై పునర్విచారణకు ఆదేశిస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్హుశుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. ఉపాధి పనుల్లో అవినీతిపై ఇటీవల చిన్నగోపవరం పంచాయతీలో చీఫ్ విజిలెన్స్ అధికారి సమగ్ర విచారణ చేశారు. 8 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే డ్వామా అధికారులు మాత్రం ఆరుగురు సిబ్బందిపై కేసులు పెట్టి ఇద్దరు ఏపీఓలను తప్పించారు. ఈ వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు కొప్పాల రఘు నేరుగా నేషనల్ ఎస్సీ కమిషనకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన అవినీతిపై పునర్విచారణ చేపట్టాలని ఎస్సీ కమిషనర్ ఆదేశించారు. దీంతో కలెక్టర్ సైతం పూర్తిస్థాయిలో పునర్విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డ్వామా అధికారులు, ఉపాధి సిబ్బందిలో గుబులు మొదలైంది.

నేడు పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటన

నేడు పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటన

నేడు పాళెంపాడులో రాష్ట్ర బృందం పర్యటన