
అడ్డగోలుగా తవ్వకాలు
కట్టమంచి చెరువులో ఇరిగేషన్ అధికారుల సూచనలు, స్పష్టమైన అనుమతులతో పూడి కతీత పనులు చేపట్టినట్లు గతంలో కూటమి ప్రజాప్రతినిధి వెల్లడించారు. తాజాగా ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన సమాచారంతో అంతా అవాక్కయ్యా రు. కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్పష్టంగా తెలియజేశారు. గత రెండేళ్లుగా తమ శాఖ తరఫున ఎటువంటి తనిఖీలు చేయలేదని ఇరిగేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. నెలలతరబడి సాగిన పూడికతీత పనులకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చేశారు. కట్టమంచి సుందరీకరణ పేరుతో టీడీపీ నాయకులు మట్టిని అక్రమంగా తరలించి దోచుకున్నట్టు స్పష్టం చేశారు.