
రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలకు ఏర్పాట్లు
పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణంలోకి మైత్రి మైదానం కేంద్రంగా ఈనెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి స్పోర్ట్స్ క్లబ్ భవనంలో క్రీడల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అండర్ 17 బాలుర వాలీబాల్, అండర్ 14 బాలురు, బాలికల కబడ్డీ పోటీలను అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 420 మంది క్రీడాకారులతో పాటు 200 వందల మంది వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది క్రీడలలో పాల్గొంటారని తెలిపారు. వీరందరికి మూడు రోజులపాటు భోజనం, వసతి, బహుమతులు సొంత నిధులతో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన జట్లను సైతం సొంత నిధులతో జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు తెలిపారు. క్రీడల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిబేట్ కమిషనర్ సురేశ్, మండల విద్యాశాఖ అధికారులు పీపీ రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, ఎస్‌జిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దీన్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మూడు రోజులపాటు
పటాన్ చెరులో క్రీడా సంబరాలు
ఈనెల 16, 17, 18 తేదీల్లో
వాలీబాల్, కబడ్డీ క్రీడలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి