
వాల్మీకి ఆశయ సాధనకు కృషి
సంగారెడ్డి జోన్: వాల్మీకి మహర్షి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేసి, అభివృద్ధి దిశగా సాగాలని కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ, పరిశ్రమల శాఖ అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.
భూ సేకరణ వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్‌తోపాటు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రయోజనం అందేలా చూడాలన్నారు. రైతులకు చెల్లించాల్సిన నగదు సకాలంలో అందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వివరించారు. సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య