
వర్షంతో కోతకు గురైన రోడ్డు
కల్హేర్–పిట్లం మధ్య నిలిచిన రాకపోకలు
కల్హేర్(నారాయణఖేడ్): భారీ వర్షం కారణంగా జిల్లా సరిహద్దులో కల్హేర్–పిట్లం మండల కేంద్రాల మధ్య రోడ్డు తెగిపోయింది. ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షంతో కల్హేర్ సమీపంలో మహరాజ్ వాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో ఫలితంగా వరద ప్రభావంతో రోడ్డు కోతకు గురైంది. మంగళవారం నుంచి కల్హేర్ నుంచి కామారెడ్డి జిల్లా పిట్లం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు తప్ప ఇతర వాహనాలు వెల్లడం లేదు. ఫలితంగా పిట్లం, బాన్స్‌వాడ, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు త్వరగా మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.