
ఓడి.. గెలిచేందుకు నో చాన్స్!
టేకు మొక్క నాటేదెప్పడు?
రైతులు గట్లపై నాటుకునేందుకు టేకు మొక్కలనూ ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం ప్రస్తుతం నిలిపివేసింది. వివరాలు 8లో u
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం?
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం అమల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వివరాలు 9లో u
సంగారెడ్డి జోన్: స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులకు తీవ్ర నిరాశే మిగిల్చినట్లయింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాలలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికలలో పోటీ చేసి గెలిచేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రెండు ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్
స్థానిక సంస్థలు (జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ, వార్డు) ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకే నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించి, కొంత సమయం తీసుకుని మరొక నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నిక నిర్వహించేవారు. ప్రస్తుతం గతంలో కంటే భిన్నంగా ఒకేసారి నిర్వహించేందుకు నిర్ణయించారు. గతంలో ఒక ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలైతే.. మరో ఎన్నిక బరిలో నిలిచేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ వెంటనే గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. దీంతో ఈ సారి ఓడి గెలిచేందుకు అవకాశం లేకుండా పోయింది.
రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు
జిల్లాలో 25 మండలాలు, ఉండగా 613 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 25 జెడ్పీటీసీ, 261 ఎంపీటీసీ, 613 గ్రామ పంచాయతీలు, 5,370 వార్డుల స్థానాలకు పోరు జరగనుంది. అయితే ఈ ఎన్నికలు రెండు విడతలలో నిర్వహించనున్నారు. మొదటి విడతలో జహీరాబాద్, నారాయణఖేడ్, రెండో విడతలో సంగారెడ్డి, అందోల్–జోగిపేట డివిజన్ల పరిధిలోని మండలాలలో పరిషత్‌తో పాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
కీలకంగా అభ్యర్థుల ఎంపిక
పరిషత్‌తో పాటు పంచాయతీ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కీలకంగా మారింది. అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపు సాధించేందుకు సరైన వారిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అధిక సీట్లు సాధించేందుకు మండలాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది.
ఒకేసారి పరిషత్, పంచాయతీ ఎన్నికలు
ఒక్క నోటిఫికేషన్‌తోనే ఎన్నికల నిర్వహణ
అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి