
ఓట్ల చోరీని నిరసిస్తూ సంతకాల సేకరణ
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ఓట్ల చోరీని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వంద మంది చొప్పున సంతకాలు చేయించాలన్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుల్లో వంద మంది చొప్పున ఈ సంతకాల సేకరణ జరగాలని అన్నారు. తద్వారా బీజేపీ సర్కారు చేస్తున్న ఓట్ల చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈనెల 12 తేదీ వరకు ఈ సంతకాల సేకరణ పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ నేత చేర్యాల ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్‌నాయక్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, పార్టీ పట్టణ ప్రెసిడెంట్ జార్జి తదితరులు పాల్గొన్నారు.