టేకు మొక్క నాటేదెప్పడు? | - | Sakshi
Sakshi News home page

టేకు మొక్క నాటేదెప్పడు?

Oct 7 2025 4:52 AM | Updated on Oct 7 2025 4:52 AM

టేకు

టేకు మొక్క నాటేదెప్పడు?

టేకు మొక్క నాటేదెప్పడు?

రైతులకు లబ్ధి..

గతంలో చిన్న, సన్నకారు రైతులకు ఎకరా చొప్పున టేకు మొక్కలు పంపిణీ చేశారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఉచితంగా అందించేది. అలాగే వాటిని పొలం గట్లపై, బీడు భూముల్లో నాటేందుకు ఉపాధి కూలీలతో గుంతలు తీయించేవారు. వాటి సంరక్షణకు సైతం ఈజీఎస్‌ ద్వారా చేయూత అందించేది. ఒక్కో మొక్కకు నెలకు రూ.5 చొప్పున చెల్లించింది. రెండేళ్ల పాటు ఈ ఆర్థిక సహాయం కొనసాగింది. ఇలా అవి వృక్షాలుగా ఎదిగేందుకు అన్నదాతలకు తోడ్పాటునిచ్చింది.

డిమాండ్‌ ఉన్నా ..

జిల్లాలో టేకు మొక్కలకు డిమాండ్‌ ఉన్నా యంత్రాంగం వాటిని అందించడం లేదు. గత హరితహారంలోనూ అందించక పోగా ఈ ఏడాది అమలు చేసి వన మహోత్సవంలో కూడా ఇవ్వలేదు. దీనిపై ఆసక్తి గల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే మొక్కలతోపాటు ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు.

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): అడవుల విస్తీర్ణం పెంచాలనే సదుద్ధేశంతో గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఏటా వర్షాకాలంలో పలు రకాల మొక్కలు నాటేలా చర్యలు కూడా చేపట్టింది. అలాగే అన్నదాతలకు ఆర్థికంగా అదనపు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో లాభదాయకమైన టేకు మొక్కలు నాటే దిశగా ప్రోత్సహించింది. మొక్కలు ఉచితంగా అందించడంతో పాటు వాటిని పొలం గట్లపై, బీడు భూముల్లో నాటించడం, సంరక్షణకు సైతం ఆర్థిక చేయుతనందిచేది. అయితే ఈ మొక్కల జాడ కానరావడం లేదు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపెట్టిన వనమహోత్సవంలోనూ ఈ మొక్కలు పూర్తిగా మాయమయ్యాయి. రైతుల నుంచి డిమాండ్‌ ఉన్న యంత్రాంగం వాటిని అందించడం లేదనే విమర్శలున్నాయి.

నిలిచిన సరఫరా

హరితహారంలో భాగంగా గతంలో ఏటా వానాకాలంలో మొక్కలు నాటేవారు. నీడనిచ్చే వేప, రావి, మర్రితో పాటు పూలు, పండ్ల మొక్కలను ప్రభుత్వం అందించేది. వీటితోపాటు రైతుల తమ పొలాల గట్లపై నాటుకునేందుకు వీలుగా టేకు మొక్కలనూ ఉచితంగా ఇచ్చేవారు. అయితే నాలుగేళ్లుగా వీటి పంపిణీ నిలిపివేశారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే నర్సరీలో ఈ మొక్కలు పెంపకం చేపట్టడం లేదు.

ఎనిమిదేళ్లుగా నిలిచిన సరఫరా

వనమహోత్సవంలోనూ కనిపించని వైనం

డిమాండ్‌ ఉన్నా అందించని యంత్రాంగం

ఆర్థిక ప్రయోజనాలకు దూరమవుతున్న రైతులు

పంపిణీ లేదు

గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ టేకు మొక్కల పంపిణీ లేదు. రైతుల నుంచి డిమాండ్‌ ఉంది. కానీ, ప్రభుత్వం మొక్కల పంపిణీపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇతర మొక్కలు పంపిణీ చేస్తుంది

– ఎపీఓ రంగనాయక్‌, ఎపీఓ, కోహెడ

టేకు మొక్క నాటేదెప్పడు?1
1/1

టేకు మొక్క నాటేదెప్పడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement