
వెంకన్నకు పీహెచ్‌డీ
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి రుద్రారంలో ఉన్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వెంకన్న డాక్టరేట్‌కు అర్హత సాధించారు. సంభావ్య చికిత్స ఏజెంట్లుగా నూతన ట్రయాజోల్, ఆక్సాడియాజోల్ హెటెరోసైక్లిక్ ఉత్పన్నాల రూపకల్పన తదితర వాటిపై అధ్యయనం చేసి వ్యాసం సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ తెలిపారు. వెంకన్న పీహెచ్‌డీకి అర్హత సాధించడంపై గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.
హిట్ అండ్ రన్ రద్దు చేయాలి
జహీరాబాద్ టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్‌ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని శ్రామిక్ భవనంలో ట్రాన్స్‌పోర్టు వర్కర్స్(డ్రైవర్)లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిట్ అండ్ రన్ విధానం డ్రైవర్ల పట్ల శాపంగా మారిందన్నారు. చట్టం పేరుతో డ్రైవర్లకు జరిమాన, జైలు శిక్ష విధించడం అమానుషమన్నారు. కొత్తగా తీసుకొచ్చిన ట్రాన్స్‌పోర్టు చట్టాన్ని రద్దు చేయాలని, డ్రైవర్లకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మహిపాల్, అబ్రహం, శేఖర్, ధనరాజ్, సంజీవ్, మోహన్ పాల్గొన్నారు.
వేతనాలు సకాలంలో
అందించాలి
రామాయంపేట(మెదక్): సకాలంలో వేతనాలు అందడం లేదని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది వాపోయారు. సోమవారం వారు సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రికి వినతిపత్రం అందజేశారు. గత నెల వేతనాలు ఇంతవరకు తమకు అందలేదని, దీంతో దసరా పండుగ జరుపుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో సిబ్బందికి వేతనాలు అందకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని బాలమణి హెచ్చరించారు.
ఒకరికి గాయాలు
వెల్దుర్తి(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... వెల్దుర్తి గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి బైక్‌పై తూప్రాన్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామశివారు గంగమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన ఆగిఉన్న బైక్‌ను రాంగ్‌రూట్లో వెళ్లి ఢీకొట్టి బీటీ రోడ్డుపై పడిపోయాడు. దీంతో ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని పోలీసులు వెల్దుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి.
చెట్లు నరికిన
పరిశ్రమకు జరిమాన
చేగుంట(తూప్రాన్): చెట్లను నరికిన పరిశ్రమ యాజమాన్యానికి జరిమాన విధించినట్లు తూప్రాన్ అటవీ రేంజ్ ఆఫీసర్ అంబర్‌సింగ్ తెలిపారు. ఓ కేబుల్ పరిశ్రమ నిర్వాహకులు మండలంలోని చిన్న శివునూర్ శివారు నుంచి జాతీయ రహదారి వరకు 30 చెట్లను నరికివేశారు. దీంతో చిన్నశివునూర్ గ్రామస్తులు జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జేసీబీని స్వాధీనం చేసుకొని పరిశ్రమకు రూ.60 వేల జరిమాన విధించినట్లు అటవీ అధికారి పేర్కొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
హవేళిఘణాపూర్(మెదక్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నరేశ్ కథనం ప్రకారం... మండల పరిధిలోని గంగాపూర్ అటవీ ప్రాంతంలో నుంచి రాత్రి వేళల్లో అదే గ్రామానికి చెందిన భాస్కర్, శ్రీనివాస్‌లకు చెందిన ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

వెంకన్నకు పీహెచ్‌డీ

వెంకన్నకు పీహెచ్‌డీ

వెంకన్నకు పీహెచ్‌డీ

వెంకన్నకు పీహెచ్‌డీ