పత్తి రైతు దిగాలు!
తగ్గిన దిగుబడితో అప్పులెట్లా తీర్చాలని ఆవేదన
● పత్తి పంటకు వానగండం ● సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.8,110
మునిపల్లి(అందోల్): అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న పంటలు వర్షార్పణం అవుతున్నాయి. జిల్లాలో వేసిన పత్తి పంటకు సుమారు రెండు నెలల పాటు వానగండం పట్టుకుంది. ఈ నేపథ్యంలో పత్తి తీసే సమయం రానే వచ్చింది. వర్షం పడుతుండటంతో పత్తి మొక్కల నుంచి కింద పడిపోయి పనికి రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగూర్ ప్రాజెక్టు ఎగువన సాగు చేసిన పత్తి, సోయా, పెసర, మినుము, చెఱకు పంటలతో పాటు తదితర పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలైన మనూర్ మండలం, బోరించా, హుక్రానతో పాటు రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి, జంబ్గి, రామోజిపల్లి, హస్నాబాద్‌తోపాటు ఆయా మండలాల్లో పంటలు నీట మునిగినట్లు రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో పత్తి పంట దిగుబడి కోసం చేసిన అప్పులు ఎట్లా తీర్చాలనే భయం రైతులను వెంటాడుతోంది. ఉన్న కాస్త పత్తి తీద్దామన్నా వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం మంజూరు చేసి ఆదుకుంటేనే కొంతలో కొంత వరకు అప్పులు తీర్చగలమని అన్నదాతలు పేర్కొంటున్నారు. పత్తి పంటకు ప్రభుత్వం ధర రూ.8,110 నిర్ణయించడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. అసలే పత్తి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ధర కూడా లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రైతులు పేర్కొంటున్నారు.
పత్తి పంటకు సీసీఐ నిబంధనలు
అంతే కాకుండా పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్‌కు, ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ ఉండాలని సీసీఐ నిబంధనలు పెట్టింది.
వర్షం నీటిలో పత్తి పంట
2025–2026లో సీసీఐ ధరలు
తేమ శాతం క్వింటాల్ ధర
8 రూ.8,110
9 రూ.8,028
10 రూ.7,947
11 రూ.7,866
12 రూ.7,785
పత్తి రైతు దిగాలు!


