
ఒకరి మృతి
పాపన్నపేట(మెదక్): చికెన్ దుకాణం నిర్వాహకుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని ఏడుపాయలలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ వివరాల ప్రకారం... నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన శేరి మహబూబ్ (35) పంక్చర్ దుకాణం నడుపుతున్నాడు. అతని సోదరి సుల్తాన ఏడుపాయల్లో చికెన్ సెంటర్ నిర్వహిస్తుంది. ఆమె దుకాణం పక్కన నాగ్సాన్‌పల్లికి చెందిన చాకలి విఠల్ సైతం చికెన్ షాపు నడుపుతున్నాడు. అయితే వీరిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుల్తాన, మహబూబ్ భార్య రేష్మా దుకాణంలో ఉండగా, పక్క షాపునకు చెందిన చాకలి విఠల్, రాజమణి, యాదగిరి, మహేశ్ వారితో ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న మహబూబ్ అక్కడకు వచ్చాడు. చాకలి విఠల్ కుటుంబీకులు జరిపిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.