
గిరిజనులు ఐక్యత చాటాలి
హుస్నాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి లంబాడీలు ఐక్యతను చాటాలని గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో ఈ నెల 8న నిర్వహించే లంబాడీల సమ్మేళన పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొందరు గోండు, ఆదివాసి నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారన్నారు. లంబాడీలు ఎస్టీలు కాదని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 30 వేల మంది గిరిజన జనాభా ఉందన్నారు. గిరిజనుల సమ్మేళనానికి ప్రతి ఇంటికి ఒకరు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు కిషన్ నాయక్, భీమా సాహెబ్, శివరాజ్, తిరుపతి నాయక్, రాజు నాయక్, శ్రీనివాస్ నాయక్, కై లు నాయక్, సత్యం నాయక్ పాల్గొన్నారు.