
నెలలో 20 పాడి గేదెలు మృతి
నారాయణఖేడ్: ఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్‌లో నెల రోజుల వ్యవధిలో 20 పాడిగేదేలు మృతి చెందాయి. తాజాగా ఆదివారం గ్రామానికి చెందిన ప్రకాశ్, జగన్లకు చెందిన రెండు పాడిగేదెలు మరణించాయి. పాడి రైతుల వివరాల ప్రకారం.. ప్రతీ ఏడాది పశువైద్య అధికారులు పాడి గేదెలకు వ్యాక్సినేషన్ చేసేవారని, ఈ ఏడాది చేయలేదన్నారు. దీంతో కడుపునొప్పికి గురై మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. పశువుల మృతిపై పశువైద్యాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఒక్కో పాడిగేదే విలువ రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. ప్రకాశ్, జగన్లకు చెందిన రెండు పాడిగేదేలు మృతి చెందగా, నెల రోజులుగా సుభాష్, గైని నర్సయ్య, షాదుల్, రఘునాథ్, రాజుగొండలతో పాటు మరి కొందరి పాడిగేదేలు మృతి చెందాయని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి గేదెల మృతిపై విచారణ జరిపి, అదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.
జగన్నాథ్‌పూర్‌లో ఘటన