
వడియారం ఘటనలో ముగ్గురు అరెస్టు
చేగుంట(తూప్రాన్): వడియారంలో బైకును ఎత్తుకెళుతున్నట్లు అనుమానించి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి ఒకరిపై పెట్రోల్‌తో నిప్పంటించిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ ఆదివారం చేగుంట పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్ అత్తగారి ఇంటికి తన స్నేహితుడు యోహానుతో కలిసి వడియారం గ్రామానికి శుక్రవారం రాత్రి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన గుండ్ల రమేశ్‌కు చెందిన బైకును తీసుకెళ్తుంటే బైకును చోరీ చేసి తీసుకెళుతున్నట్లు అనుమానించి మహిపాల్, యోహానుపై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ ఇద్దరిపై దాడి చేసింది గ్రామానికి చెందిన రామకృష్ణ , రమేశ్, అనీల్‌గా గుర్తించి ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డితో పాటు పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.