అన్ని మతాల సారాంశం ఒక్కటే | - | Sakshi
Sakshi News home page

అన్ని మతాల సారాంశం ఒక్కటే

Oct 6 2025 6:23 AM | Updated on Oct 6 2025 6:23 AM

అన్ని

అన్ని మతాల సారాంశం ఒక్కటే

అన్ని మతాల సారాంశం ఒక్కటే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి సమస్యలు పరిష్కరించాలి సింగూరుకు వరద పథసంచాలన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు: అన్ని మతాల సారాంశం ఒక్కటేనని.. ప్రతి ఒక్కరూ పరమత సహనాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ముత్తంగి పరిధిలోని మహమ్మద్‌ సుభాని దర్గాలో ఆదివారం ఏర్పాటు చేసిన గ్యార్వి ఉత్సవాల్లో మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చదర్‌ సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌ ఉపేందర్‌, సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌, మేరాజ్‌ ఖాన్‌, రామకృష్ణ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌

జహీరాబాద్‌ టౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాలు గెలుచుకుని సత్తా చాటాలని ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. మొగుడంపల్లి,కోహీర్‌ మండలాల్లో ఆదివారం వేర్వేరుగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో చంద్రశేఖర్‌ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సుధీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని, అంకితభావంతో పనిచేస్తున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కాలన్నారు. టికెట్‌ ఎవరికి ఇచ్చిన ప్రతీ ఒక్కరు కష్టపడి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు తమ పేర్లను మండల కమిటీకి అందిస్తే జిల్లా పార్టీకి పంపిస్తామని తెలిపారు. సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ... పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. సమావేశాల్లో సీనియర్‌ నాయకులు డాక్టర్‌ ఉజ్వల్‌రెడ్డి, తన్వీర్‌, మండల అధ్యక్షులు మక్సూద్‌ తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు టౌన్‌: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో ఉంటున్న వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకులు నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలతో కలిసి అన్ని బ్లాక్‌లను తిరిగి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండేళ్లుగా నివాసం ఉంటున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రతీ ప్లాట్‌కు ఏడాదికి రూ.2,500 ఇంటి పన్ను కట్టించుకుంటున్న మున్సిపల్‌ అధికారులు ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాండు రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యురాలు నాయిని లలిత, సునీత, జార్జ్‌,రమణయ్య, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

పుల్‌కల్‌(అందోల్‌): సింగూరు ప్రాజెక్టుకు భారీ గా వరద చేరుతోంది. రెండు గేట్‌ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 15,822 క్యూసెక్కుల నీటిని రెండు గేట్‌ల ద్వారా కిందికి వదులుతున్నారు. ఆదివారం భా రీ వర్షం కురవడంతో డ్యామ్‌లోకి ఇన్‌ఫ్లో పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పటాన్‌చెరు: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పథసంచాలన్‌ కార్యక్రమం పోస్టర్‌ను ఆదివారం పటాన్‌చెరు డివిజన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యవహా ఆకుల వెంకటేశ్వర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పటాన్‌చెరులో పథ సంచలన్‌ కార్యక్రమాన్ని ఈ నెల 12న ఆదివారం జేపీ కాలనీలోని విద్యాభారతి స్కూల్‌లో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమాన్ని హిందూ బంధువులు కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అన్ని మతాల  సారాంశం ఒక్కటే 
1
1/2

అన్ని మతాల సారాంశం ఒక్కటే

అన్ని మతాల  సారాంశం ఒక్కటే 
2
2/2

అన్ని మతాల సారాంశం ఒక్కటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement