
మీటర్, స్టార్టర్‌బాక్స్ ధ్వంసం
కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు మీటర్, స్టార్టర్ బాక్స్‌ను ధ్వంసం చేశారు. వివరాలు ఇలా... మండలంలోని రాజీపేట ప్రాథమికోన్నత పాఠశాలలో దసరా సెలవుల సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాలకు తాళం వేశారు. కాగా పునఃప్రారంభం రోజు వచ్చేసరికి పాఠశాలలోని కరెంట్ మీటర్, బోర్ స్టార్టర్ బాక్స్ ధ్వంసమై ఉన్నాయి. దీంతోపాటు విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం చేతులు కడుకునే ట్యాప్స్‌ను సైతం విరగగొట్టారు. ఈ విషయమై హెచ్‌ఎం కిశోర్ మాట్లాడుతూ గతంలో సైతం బాత్‌రూమ్‌లో ట్యాప్స్ ధ్వంసం చేశారని, ఇలాంటివి జరగకుండా గ్రామస్తుల దృష్టికి సమస్యను తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ధ్వంసం చేసిన స్టార్టర్‌బాక్స్, కరెంట్ మీటర్
రాజీపేట పాఠశాలలో ఘటన

మీటర్, స్టార్టర్‌బాక్స్ ధ్వంసం