దేశ సమగ్రతే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దేశాన్ని సమైక్యంగా ఉంచడమే ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) లక్ష్యమని దేశ మెదక్ విభాగ్ ప్రచారక్ భూపేశ్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెదక్ విభాగ్ ప్రచారక్ మాట్లాడుతూ.. వందేళ్లుగా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, దేశాభివృద్ధిలో ఆర్‌ఎస్‌ఎస్ సేవలు మరువలేనివన్నారు. దేశంలో ఎక్కడ విపత్తు ఏర్పడినా మొదటగా ఉండేది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే అన్నారు. అనంతరం కరసేవకులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పథ్ సంచాలన్ నిర్వహించారు. వీరికి పట్టణ ప్రజలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
దేశ శ్రేయస్సే లక్ష్యం: ఎంపీ
దేశ శ్రేయస్సే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ పథ్‌సంచాలన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని కొనియాడారు. గ్రూపులుగా విడిపోయిన వామపక్షాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. వందేళ్ల నుంచి పేరు మార్చుకోకుండా ఒకే పేరుతో ఉండి దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అన్నారు. దేశ సేవకు అంకితం అవుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
మెదక్ విభాగ్ ప్రచారక్ భూపేశ్
దేశ సమగ్రతే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం


