
చర్చి వద్ద ఇరువర్గాల ఘర్షణ
నర్సాపూర్: నర్సాపూర్‌లోని సీఎస్‌ఐ చర్చి ఆవరణలో ఆదివారం ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వివరాలు ఇలా... చర్చి కమిటీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. కాగా ఎన్నికల్లో చర్చి ఫాదర్ రెవరెండ్ సందీప్‌కుమార్ ఒక వర్గానికి అనుకూలంగా పని చేశారని ఓటమి చెందిన ప్యానెల్ ప్రతినిధులు రాజ్‌కుమార్, నవీన్, జయప్రకాశ్ తదితరులు ఆరోపించారు. అందులో భాగంగా రాజ్‌కుమార్ ప్యానెల్ సభ్యులు ఫాదర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో ఉన్న బ్యానర్‌ను పట్టుకుని చర్చి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన వినోద్‌కుమార్, అరున్‌కుమార్ తదితరులు అక్కడికి చేరుకుని ప్రార్థనలు చేసే సమయంలో చర్చి ఆవరణలో నినాదాలు చేయడం సరికాదని, ఇతర చర్చి సభ్యులకు ఇబ్బందులు కలిగించొద్దన్నారు. ఏదైనా ఉంటే చర్చి కార్యాలయంలో కూర్చుని మాట్లాడుకుందామని, లేదా హెడ్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని సూచించారు. అయినా వినకుండా రాజ్‌కుమార్ వర్గీయులు నిరసన కొనసాగించారు. కాగా పోలీసులకు సమాచారం అందడంతో చర్చి వద్దకు వచ్చి ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఇరువర్గాలకు సూచించారు.
నచ్చజెప్పిన పోలీసులు