
మరో ఘటనలో తల్లీకొడుకు..
శివ్వంపేట్ల(నర్సాపూర్): కొడుకుతో సహా తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పెద్దకోళ్ల పోచయ్యతో నవాబుపేట గ్రామానికి చెందిన అమూల్యకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు వరుణ్‌తేజ్ ఉన్నాడు. కాగా ఈనెల 3వ తేదీన సంసారం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త పొలం దగ్గరకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, కొడుకు కనిపించలేదు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.