
ఆటో డ్రైవర్ కూతురుకు ఎంబీబీఎస్‌లో సీటు
కంప్యూటర్స్ చోరీ
మద్దూరు(హుస్నాబాద్): మోడల్ స్కూల్‌లో దొంగలు కంప్యూటర్లను ఎత్తికెళ్లారు. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో మండలంలోని పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లారు. కాగా గత నెల 27న రాత్రి 8గంటల సమయంలో దొంగలు అసంపూర్తిగా ఉన్న భవనంలోకి వెనుకవైపు నుంచి ప్రవేశించారు. కంప్యూటర్ ల్యాబ్ కిటికీని పగులగొట్టి లోపలికి వెళ్లారు. ల్యాబ్ వెలుపల, లోపల ఉన్న సీసీ కెమెరాల డైరెక్షన్‌ను మార్చి సుమారు రూ.6లక్షల విలువ జేసే తొమ్మిది ల్యాప్‌ట్యాప్‌లు, మూడు కంప్యూటర్స్‌ను ఎత్తుకెళ్లారు. శనివారం స్కూల్‌కు వచ్చిన ఉపాధ్యాయులు గుర్తించారు. స్కూల్ ప్రిన్సిపాల్ నరేందర్‌రెడ్డి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా చేర్యాల సీఐ శ్రీను క్లూస్‌టీంతో కలిసి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.
పర్మిట్ రూమ్‌లో వ్యక్తి మృతి
హవేళిఘణాపూర్(మెదక్): పర్మిట్ రూమ్‌లో మద్యం తాగిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ మండలం మంభోజిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మెదక్ పట్టణం నర్సిఖేడ్‌కు చెందిన నీలగిరి సురేశ్(36) మంభోజిపల్లి వద్దకు వచ్చి కల్లు తాగాడు. అనంతరం మద్యం దుకాణంలోకి వెళ్లి మద్యం తాగి అక్కడే పడిపోయాడు. విషయాన్ని గుర్తించిన మద్యం షాపు యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సంబంధీకులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మృతదేహాన్ని మెదక్ ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు మెదక్‌రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ..
చేర్యాల(సిద్దిపేట): మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు, బంధువులు వివరాల ప్రకారం... మండలంలోని తడ్కపల్లి గ్రామానికి చెందిన గడీల సంతోష్‌కుమార్‌కు సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి(30)తో 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు పట్టణ కేంద్రంలో నివాసముంటండగా, సంతోష్ ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో విద్యుత్‌షాక్ తగిలి కింద పడిందని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని బావమరిదికి సంతోష్ ఫోన్ చేసి చెప్పాడు. అపస్మారకస్థితిలో ఉన్న భాగ్యలక్ష్మిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. కాగా తమ కూతురును భర్త, అత్త కలిసి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
చిన్నశంకరంపేట(మెదక్): ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మండల హార్టికల్చర్ ఆఫీసర్ సుజాత అన్నారు. శనివారం మండలంలోని కాస్లాపూర్ గ్రామంలో రైతు ఆనందరావు 2 ఎకరాల భూమిలో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సబ్సిడీతో ఆయిల్ పామ్ మొక్కలు, డ్రిప్ సౌకర్యం అందిస్తుందన్నారు.

ఆటో డ్రైవర్ కూతురుకు ఎంబీబీఎస్‌లో సీటు