
పక్షవాతంతో.. జీవితంపై విరక్తి చెంది..
వేర్వేరు కారణాలతో ఉమ్మడి జిల్లాలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
పటాన్‌చెరు టౌన్: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగికి చెందిన సాయిలు(53) సంవత్సరం క్రితం కుడి చేయి, కుడికాలు పక్షవాతం కారణంగా పనిచేయడం లేదు. అయితే భార్య నర్సమ్మ కూలి పని చేసుకుంటూ ఇంటిని పోషిస్తుంది. ఇంటికి భారమవుతున్నానని, నేను బతికి ఉండే కంటే చనిపోవడం మేలని భార్యతో చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమంలో 3వ తేదీన నరసమ్మ పనికి వెళ్లి, తిరిగి 4న ఇంటికి వచ్చి చూసేసరికి భర్త గుర్తుతెలియని విషం తాగి, వాంతులు చేసుకుంటూ కనిపించాడు. దీంతో వెంటనే పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిక్షీంచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
కుటుంబ కలహాలతో..
శివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బీమ్లా పంచాయతీ టౌర్య తండాకు చెందిన జరుప్ల శ్రీను(40) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆర్థిక, కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య దేవితో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
అనారోగ్య సమస్యలతో మహిళ..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. సదాశివపేట సీఐ వెంకటేశ్ వివరాల మేరకు.. మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన కంకోల్ భాగ్యమ్మ(56)కూలి పనులు చేస్తూ కుమారుడితో కలిసి జీవిస్తుంది. ఆమెకు కాళ్ల నొప్పులతో బాధపడుతుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు భరించలేక గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విషం తాగి వ్యక్తి ఆత్మహత్య