
పదేళ్లుగా సాగు
పదేళ్లుగా బంతి పూలు సాగు చేస్తున్న.పండుగలు, వేడుకలు, పలు శుభకార్యాలకు పంట అందేలా మొక్కలు నాటుతాం. పెట్టుబడి మొత్తం రూ. 40 వేల నుంచి 50 వేల వరకు అవుతుంది. ఎకరానికి 5 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది.
– బొల్లిపల్లి రవీందర్‌రెడ్డిచౌదరిపల్లి, వర్గల్ మండలం)
ముద్దాపూర్‌లో 30 ఎకరాల్లో..
మా గ్రామంలో దాదాపు 30 ఎకరాల్లో బంతి సాగు చేస్తారు. నేను మూడు దశాబ్దాలుగా సాగు చేస్తున్న. పెద్దగా తెగుళ్లు, రోగాలు రావు. దసరా, దీపావళికి పంట కోతకు వచ్చేటట్టు సాగుచేస్తం. వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో భారం తగ్గుతుంది.
– కన్నెబోయిన వెంకట్‌రెడ్డి, రైతు ముద్దాపూర్
ఉద్యాన రైతులకు ప్రోత్సాహం
ఉద్యాన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.8వేల వరకు ప్రోత్సాహం అందిస్తుంది. సాగుకు సంబంధించిన రశీదులతోపాటు, ఆధార్, బ్యాంక్ అకౌంట్, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్‌లను అప్లికేషన్‌ను ఉద్యాన అధికారి కార్యాలయంలో సమర్పించాలి.
– సౌమ్య, గజ్వేల్ డివిజన్ ఉద్యాన అధికారి

పదేళ్లుగా సాగు