
నేడు అందోల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఏర్పాట్లు పర్యవేక్షించిన
మాజీ ఎంపీ బీబీ పాటిల్
జోగిపేట(అందోల్): అందోలు శివారులోని లక్ష్మినర్సింహ ఫంక్షన్ హాలులో ఈనెల 5న నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు హాజరు కానున్నట్లు మాజీ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో స్థానిక నాయకులతో కలసి బీబీ పాటిల్ అలయ్ బలయ్ కార్యక్రమ ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, చౌటకూరు, మునిపల్లి, రాయికోడ్, వట్‌పల్లి, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.