
హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే చింతా
సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావును కలిసిన వారిలో టీఎన్‌జీఓస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజేందర్, మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, చక్రపాణి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణగౌడ్, శంకర్‌గౌడ్, ఇంద్రారెడ్డి, పార్టీ నాయకులు తదితరులున్నారు.
సంగారెడ్డిలో భారీ వర్షం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లోని రైతులు, ప్రజలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రెండు గేట్ల ద్వారా
నీటి విడుదల
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గడంతో రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత పక్షం రోజులుగా 11 గేట్‌ల ద్వారా నీటిని విడుదల చేయగా ఇన్‌ఫ్లో తగ్గడంతో 9 గేట్‌లను మూసివేసి రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 17.5 టీఎంసీల నీటి నిలువ ఉంచి 38,467 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జోరు తగ్గిన మంజీరా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు.
ఐక్యతతోనే
రాజ్యాధికారం సాధ్యం
జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి
గజ్వేల్‌రూరల్: బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు. గజ్వేల్‌కు చెందిన యాదగిరి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సంద ర్భంగా గజ్వేల్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీల్లో ఐక్యత లోపించిన కారణంగానే రాజ్యాధికారానికి దూరమవుతున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత ఎంతో అవసరమన్నారు. వారిని చైతన్యం చే స్తూ సంఘటిత పోరాటం చేస్తామని పేర్కొన్నా రు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతిని పటిష్టం చేసి సత్తా చాటుతామని పేర్కొన్నారు.

హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే చింతా

హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే చింతా

హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే చింతా

హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే చింతా