
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
న్యాల్‌కల్(జహీరాబాద్): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కై వసం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం ముంగి ఎస్‌ఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని సూచించారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను సేకరించి తమకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ చంద్రశేఖర్