
బస్సులన్నీ రద్దీ
● స్వస్థలాల నుంచి
తిరుగుప్రయాణమైన ప్రజలు
● ప్రయాణికులతో
కిటకిటలాడిన బస్టాండ్
జహీరాబాద్: దసరా సెలవులు ముగియడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ప్రయాణీకులతో రద్దీగా మారాయి. దీంతో శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. దసరా పండుగ సెలవుల సందర్భంగా బంధువుల ఇళ్లకు, స్వస్థలాలకు వెళ్లిన వారంతా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్తుండటంతో ప్రయాణికులతో సందడిగా మారాయి. హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి, నిజామాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆర్టీసీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.