
నర్సింహారెడ్డిని తొలగించలేదు
జహీరాబాద్ టౌన్: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నర్సింహ్మరెడ్డి కొనసాగుతారని, ఆయనను పదవి నుంచి తొలగించలేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు. నర్సింహారెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు నియోజకవర్గం ఇన్‌చార్జి చంద్రశేఖర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు శనివారం హైదరాబాద్ తరలివెళ్లి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ నర్సింహారెడ్డిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించలేదని, మండల అధ్యక్షులుగా ఆయనే కొనసాగుతారన్నారు. సమావేశంలో ఎంపీ.సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ ఉజ్వల్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి వివేక్