పండుగ కిక్కు | - | Sakshi
Sakshi News home page

పండుగ కిక్కు

Oct 4 2025 6:44 AM | Updated on Oct 4 2025 6:44 AM

పండుగ

పండుగ కిక్కు

కొల్చారం(నర్సాపూర్‌): ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరాకు ‘కిక్కు’ అదిరింది. అక్టోబర్‌ 2న దసరా రావడం అదే రోజు గాంధీ జయంతి ఉండడంతో ముందస్తుగానే మద్యం దుకాణాదారులు అమ్మకాలు చేపట్టారు. జిల్లాలోని కొల్చారం మండలం చిన్నఘనాపూర్‌ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం (ఐఎంఎల్‌ డిపో) ద్వారా పండగకు ముందు గత నెల 29, 30 ఈనెల 1 (ఈ మూడు రోజుల్లో) ఏకంగా రూ. 22.17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. వీటిలో 23,714 కేసుల లిక్కర్‌, 18,988 కేసుల బీర్‌ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 3.57 కోట్ల అధిక మద్యం అమ్ముడైంది.

మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలి: ఎస్పీ

సంగారెడ్డిజోన్‌: మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పిలుపునిచ్చారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సత్యం, అహింసా, సామరస్యంతో కూడిన తత్వాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

అమ్మ అందరిని

చల్లగా చూడు

మనోహరాబాద్‌(తూప్రాన్‌): దుర్గామాత అందరినీ చల్లగా చూడాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీని మాలధారులు శాలువాతో సన్మాంచి అమ్మవారి ప్రతిమను అందజేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు బక్క వెంకటేశ్‌గౌడ్‌, నాయకులు నత్తి మల్లేశ్‌, అజయ్‌, శ్రీకాంత్‌, నాగరాజు, బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.

సీడీసీ చైర్మన్‌గా ముబీన్‌

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ)ౖ చెర్మన్‌గా అసంద్‌గంజ్‌కు చెందిన ముబీన్‌ నియమితులయ్యారు. రాయికోడ్‌ మండల పరిఽధి గోదావరి, గంగా ఆగ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ షుగర్‌ కంపెనీకి అనుసంధానంగా చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, క్రేన్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్లుగా మల్లారెడ్డి, రవీంద్రరెడ్డిలు నియమితుయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నా యకులు డాక్టర్‌ ఉజ్వల్‌రెడ్డి వీరిని శుక్రవారం సన్మానించారు.

నిమజ్జనానికి భారీ బందోబస్తు

సంగారెడ్డి క్రైమ్‌: జిల్లాలో శనివారం జరిగే దుర్గామాత నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సత్తయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 100కుపైగా దుర్గాదేవి విగ్రహాలకు 150 మంది పోలీస్‌లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనోత్సవాలకు డీజేకు అనుమతి లేదన్నారు. మహిళల రక్షణకు మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారన్నారు.

పండుగ కిక్కు 1
1/3

పండుగ కిక్కు

పండుగ కిక్కు 2
2/3

పండుగ కిక్కు

పండుగ కిక్కు 3
3/3

పండుగ కిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement