దసరా సంబురం
సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని రామమందిరం నుంచి సీతారాముల షావను పురవీధుల గుండా స్టేడియం వరకు తీసుకొచ్చారు. వేదికపై దుర్గామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన రావణాసురుడి భారీ కటౌట్‌ను బాణాసంచాలతో దహనం చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శమీ ఆకులు ఒకరినొకరు ఇచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డితో పాటు ఆమె కూతురు జయారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
– సంగారెడ్డి జోన్


