స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దాం
ప్రశాంత్‌నగర్(సిద్ధిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా మెదక్ ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ...స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు గెలుపొందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అందుకోసం నాయకులు, కార్యకర్త ప్రజల్లో మమేకం అవ్వాలని సూచించారు. రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో కలిసికట్టుగా శ్రమించి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, సాకి ఆనంద్, కలీమొద్దీన్, మహేందర్‌రావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా
ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్


