
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐపై వేటు
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కేసు దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి నుంచి డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా ఎప్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి లాడ్జి నిర్వాహకుడు జోగిపేట పట్టణం ఇందిరానగర్‌కు చెందిన అల్లే లోకేష్ (40)కు డబ్బులు అడగడటం.. పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయని మన:స్తాపానికి గురై నదిలోకి దూకి గల్లంతయ్యాడు. లోకేష్ భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ద్వారా ప్రాథమిక విచారణ జరిపించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. రూరల్ ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. దీంతో మల్టీ జోన్‌ఐఐ ఐజీ ఆదేశాల మేరకు రవీందర్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఏ స్థాయిలో ఉన్నా శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ పరితోష్ హెచ్చరించారు.