
కులం పేరుతో దాడి
ఎస్సీ ఎస్టీ
కేసు నమోదు
జగదేవ్‌పూర్(గజ్వేల్): పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కులంపేరుతో దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఏసీపీ నర్సింలు కేసుపై విచారణ చేపట్టారు. ఈ కేసు వివరాలను ఎస్‌ఐ వివరాలను వెల్లడించారు. మండలంలోని పీర్లపల్లికి చెందిన దేవి మహిపాల్, జగదేవ్‌పూర్‌కు చెందిన బి. ఎల్లయ్య, మహేష్, మల్లయ్య కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా భూ వివాదం కొనసాగుతుంది. కాగా గురువారం దేవి మహిపాల్ గొర్రెలను మేపుతుండగా.. ముగ్గురు కలిసి కర్రతో దాడి చేయగా మహిపాల్ తలకు గాయాలు కావడంతో పాటు ఓ గొర్రె మృతి చెందింది. వెంటనే బాధితుడు జగదేవ్‌పూర్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారిపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఏసీపీ నర్సింలు పీర్లపల్లిలో దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడుతూ చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.