భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలి
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తు దసరా అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలని బుధవారం ప్రకటలో కోరారు.
సోదరభావంతో జరుపుకోవాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట(సంగారెడ్డి): ప్రజలందరు భక్తి సోదరభావంతో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కేతకీ సంగమేశ్వర ఆటో ఫైనాన్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరై భక్తులకు వడ్డించారు. ఇక పట్టణ పరిధిలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండలపాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్‌ఎస్ నాయకులు చింతా సాయినాథ్, పైనాన్స్ సభ్యులు సరాప్ చంద్రయ్య, కాశినాథ్, ప్రవీణ్, ప్రకాశం భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఇంటిలో
ఆనందోత్సాహాలు నింపాలి
కలెక్టర్ ప్రావీణ్య విజయదశమి శుభాకాంక్షలు
సంగారెడ్డి జోన్: విజయదశమి పర్వదినం పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రావీణ్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలను నింపాలని, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో అందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలన్నారు.
శివాలయం కేంద్రంగా దసరా వేడుకలు
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో కై లాసగిరి శివాలయం కేంద్రంగా గత నాలుగు దశాబ్దాల నుంచి దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాత పట్టణం అయిన మాణిక్‌ప్రభు కాలనీలోని శ్రీ మాణిక్‌ప్రభు ఆలయం నుంచి భవానీమాత ఆలయం మీదుగా శివాలయం వరకు శ్రీరంగం నిర్వహిస్తారు. దసరా ఊరేగింపులో ప్రముఖులతోపాటు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. రాత్రి పూట ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో రావణదహనం, లేజర్ షో నిర్వహిస్తారు. వేడుకల్లో చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి వీక్షిస్తారు.
నేడు మాంసం, మద్యం
దుకాణాలు బంద్
నారాయణఖేడ్: అక్టోబరు 2వ తేదీ గాంధీజయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో మాసం, మద్యం విక్రయాలను బంద్ చేయాల్సిందిగా అటు మున్సిపాలిటీల అధికారులు మాసం దుకాణాల యజమానులకు, ఇటు మద్యం దుకాణాలకు ఎకై ్సజ్ అధికారులు ఆదేశించారు. కోళ్లు, మేకలు, గొర్రెలు వధశాలలు, దుకాణాల యజమానులకు మున్సిపాలిటీల అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆరోజు మాసం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలి
భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలి
భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలి


