మెడికల్ సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులు
జహీరాబాద్ టౌన్: నీట్ (ఎంబీబీఎస్) రెండవ రౌండ్ కౌన్సెలింగ్‌లో మండలంలోని అల్గోల్ మైనార్టీ బాలుర గురుకుల ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల నలుగురు విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్లు వచ్చాయని ప్రిన్సిపాల్స్ జె.రాములు, కేఎస్ జమీల్‌లు తెలిపారు. నీట్‌లో మంచి ర్యాంక్‌లు సాధించిన ఎండీ.ఫిరొద్దీస్‌కు జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చిందన్నారు. ధర్మతేజకు నోవా వైద్యకళాశాల, సిద్దరమేశ్‌కు ప్రభుత్వ వైద్య కళాశాల నారాయణపేట, ఆయాన్‌కు వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాలలో సీట్లు వచ్చాయని చెప్పారు. మొదటి రెండవ కౌన్సెలింగ్‌లో మొత్తం ఏడుగురికి మెడికల్ కళాశాలలో సీట్లు వచ్చాయన్నారు.

మెడికల్ సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులు

మెడికల్ సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులు

మెడికల్ సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులు