
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి అధికారి బాధ్యతతో తమ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులకు బుధవారం వీడియో కాల్ చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, వాటి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించి, బైండోవర్ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే మద్యం, డబ్బు, ఇతర వస్తువులు అక్రమ రవాణ జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.