
పకడ్బందీగా విధులు నిర్వహించాలి
కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా నిఘా బృందాలు పగడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, ఎంసిసి బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సెప్టెంబర్ 29 నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని, స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిబంధన ల మేరకు అవకాశాలు కల్పిస్తామమన్నారు. రూ.50వేల కంటే ఎక్కువ తీసుకు వెళ్తే వాటికి సరైన పత్రాలు చూపించకపోతే సీజ్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, జెడ్పీ సీఈవో రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస మూర్తి పాల్గొన్నారు.