డీజిల్ లేక.. ఆగిన చెత్త ట్రాక్టర్
చిలప్‌చెడ్(నర్సాపూర్)): గ్రామంలో ప్రతి నిత్యం చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్, సరిపడా డీజిల్ లేక వీధి మధ్యలో నిలిపివేసారు. ఈ ఘటన మండలంలోని చండూర్ గ్రామంలో బుధవారం జరిగింది. కొంత కాలంగా సరైన నిధులు లేక చండూర్ గ్రామంలో చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్ మూలన పడింది. ఈ మధ్యనే చెత్త సేకరిస్తున్న ట్రాక్టర్ డీజిల్ లేకపోవడంతో గ్రామంలోని ఓ వీధి మధ్యలోనే నిలిపేశారు. దీంతో ఆగిపోయిన ట్రాక్టర్ పరిస్థిని చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. అనంతరం గ్రామ కార్మికుడు డీజిల్ తీసుకువచ్చి చెత్త ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు.


