
భవానమ్మ పల్లెలో నవరాత్రి ఉత్సవాలు
శివాజీ మహారాజ్ నిర్మించిన
‘తుల్జా భవానీ’ ఆలయం
జహీరాబాద్: మొగుడంపల్లి మండలంలోని ఖాంజమాల్‌పూర్ (భవానమ్మపల్లె)లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ స్వయంగా తుల్జా భవానీమాత ఆలయాన్ని నిర్మించారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 400 సంవత్సరాల క్రితం శివాజీ మహరాజ్ ఆలయాన్ని నిర్మించారని పురాణ గాథలున్నాయి. ఆయన యుద్ధానికి వెళ్లే ముందు జహీరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ గ్రామంలో సేద తీరారని, విజేతనై వస్తే భవానీమాతకు ఈ ప్రాంతంలో ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. విజయం సాధించాక ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. భవానీమాత ఆలయం ఎదుట శివాజీ మహరాజ్ ఆలయం సైతం ఉంది. తుల్జాభవానీ మాత ఆలయంలో ప్రతి పౌర్ణమికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటారు. ఒక రోజు ముందుగానే ఆలయానికి చేరుకుంటారు. భక్తులకు అన్నదానం కూడా చేస్తారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.

భవానమ్మ పల్లెలో నవరాత్రి ఉత్సవాలు

భవానమ్మ పల్లెలో నవరాత్రి ఉత్సవాలు