
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
కొమురవెల్లి(సిద్దిపేట): బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్‌చంద్రబోస్ అన్నారు. బుధవారం ఆయన స్వామి వారిదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య నాహక్కు, బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం అనే నినాదంతో ముందుకు సాగు దామని పిలుపునిచ్చారు. గత ప్రభుతం మూసేసిన 6వేల పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్నారు. ఆయన వెంట రాజు, అమరేందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
గజ్వేల్‌రూరల్: తప్పిపోయిన బాలుడిని గుర్తించి పోలీసులు తండ్రికి అప్పగించారు. ఈ ఘటన బుధవారం గజ్వేల్‌లో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... తూప్రాన్‌కు చెందిన పానాటి చరణ్(8) గజ్వేల్ బస్టాండ్ పరిసరాల్లో తిరుగుతుండటం గమనించిన పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాలుడికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అతని తండ్రి పానాటి సత్తికి సమాచారం అందించారు. అనంతరం తండ్రికి బాలుడిని అప్పగించడంతో పాటు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
హత్నూర(సంగారెడ్డి): మండలంలోని గోవిందరాజ్ పల్లి బస్టాండ్ సమీపంలోని కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం... కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంను స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 35 ఏళ్లు ఉంటాయి. వైట్ హౌస్ బ్రాండ్ పాయింట్ కాకి కలరుతోపాటు తెలుపు బనీను ధరించాడు.
పసల్వాది గ్రామ శివారులో...
సంగారెడ్డి టౌన్ : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని పసల్వాది గ్రామ శివారులో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ వివరాల ప్రకారం... గ్రామ శివారులో గుర్తుతెలియని మృతదేహం ఉందని స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. శవాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
రూ.47 లక్షలు పోగొట్టుకున్న
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
పటాన్‌చెరు టౌన్: సైబర్ నేరగాళ్ల మెసేజ్‌కు స్పందించి ఉద్యోగి డబ్బులు పోగొట్టుకున్నాడు. క్రైమ్ సీఐ రాజు వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సెప్టెంబర్ 15న తన ఫోన్‌కు టాస్కులు చేస్తే కమీషన్ ఇస్తామని గుర్తుతెలియని మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి తన వివరాలు నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగి నగదు చెల్లించి టాస్కులు చేయడం మొదలు పెట్టాడు. కాగా అతడు పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. బాధితుడు మొత్తం రూ.47 లక్షల 67 వేలు చెల్లించాడు. ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడగగా స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్, పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జోగిపేట(అందోల్): మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై పాండు వివరాల ప్రకారం... మంగళవారం రాత్రి పట్టణంలోని మల్లన్న కాలనీకి చెందిన కమ్మరి నరేశ్ (20)కు 2021లో వివాహం జరిగింది. కొన్ని రోజులకు భార్యకు విడాకులు ఇచ్చాడు. పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఉరి వేసుకున్నాడు.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం