
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం
న్యాల్‌కల్(జహీరాబాద్): దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచారక్, వనవాసి కల్యాణ పరిషత్తు సోమయాజులు అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం న్యాల్‌కల్‌లో పద సంచాలన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. అనంతరం స్థానిక కృష్ణ కన్వెన్షన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమయాజులు మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ 1925లో విజయ దశమినాడు ఆవిర్భవించిందన్నారు. విపత్తు సమయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తమ సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్, రాంచందర్ పవార్‌తో పాటు ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
న్యాల్‌కల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం