
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుకోవాలని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ మురళి వివరాల ప్రకారం... మండలంలోని కూకుట్లపల్లి గ్రామానికి చెందిన చింతల గణేశ్(18) చదువు ఆపేసి ఇంటివద్ద పొలం పనులు చేస్తున్నాడు. కాగా తల్లి చదువుకోవాలని పలుమార్లు మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అతడు గత నెల 9న ఇంట్లో గడ్డి మందు తాగి, విషయం ఎవరికి చెప్పలేదు. నోరు పొక్కినట్లు ఉండటంతో గమనించిన తల్లి సుశీల, బంధువు అనీల్‌కుమార్ బాధితున్ని మెదక్‌లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వారం రోజులపాటు చికిత్స చేయించారు. తల్లి గట్టిగా అడగటంతో గడ్డి మందు తాగినట్లు చెప్పాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం గత నెల16న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన..
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని శాలిపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన బుస్స రమేశ్(45) సోమవారం చిన్నశంకరంపేటకు వచ్చి తిరిగి వెళుతుండగా అంబాజిపేట వద్ద మెదక్ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాలు నుజ్జు నుజ్జు కావడంతో పాటు తలకు తీవ్రంగా గాయమైంది. మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, ప్రాథమిక వైద్యం అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.
గుండె పోటుతో వాచ్‌మెన్..
పాపన్నపేట(మెదక్): గుండెపోటుతో వాచ్‌మెన్ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిఽధిలోని నాగ్సాన్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మంగళవారం రాత్రి ఏడుపాయల్లో విధులు నిర్వహించిన బైండ్ల నర్సింహులు(45) బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లగానే ఇంట్లో గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించాడు. కాగా అతడి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏడుపాయల ఉద్యోగులు అంత్యక్రియల కోసం రూ.30 వేల ఆర్థిక సహాయం చేశారు.

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి